Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Wednesday, December 17, 2014

Mana Kamareddy

వాళ్ళని అల్లా కూడా క్షమించడు..!!


పాము ను పాలు పోసి పెంచితే అది చివరికి పోషించిన వాడినే కాటు వేస్తుంది అనటానికి మంచి ఉదాహరణ
అక్కడి పాలకులు చేసిన పాపానికి ఏమి తెలియని చిన్నారులు ఎందుకు బలి కావాలి?

పాకిస్తాన్ లోని పెషావర్ పట్టణం లో తాలిబాన్ల కాల్పులలో తీవ్రంగా గాయపడిన షారుక్‌ఖాన్‌ అనే విద్యార్ధి మనోగతం  మీ కోసం..

మేమందరం కెరీర్‌ గైడెన్స్‌ సెషన్‌లో భాగంగా స్కూల్‌ ఆడిటోరియంలో ఉండగా.. పారామిలటరీ యూనిఫాంలు, తుపాకులు ధరించిన నలుగురు లోపలికి చొరబడ్డారు. వెంటనే ఎవరో ‘అందరూ బెంచీల కింద దాక్కోండి’ అని అరిచారు. ఆ దుండగులేమో.. ‘అల్లాహు అక్బర్‌’ అని గట్టిగా అరుస్తూ విచక్షణ రహితంగా కాల్పులు మొదలుపెట్టారు. అంతలో, వారిలో ఒకడు.. ‘చాలామంది బల్లల కింద ఉన్నారు. వారినీ కాల్చేయండి’ అని అరిచాడు. అప్పటికే నా రెండు మోకాళ్లకింద బుల్లెట్లు దిగాయి. నొప్పిని భరిస్తూ బెం చీ కింద దాక్కున్నాను. కొద్దిగా కళ్లు తెరిచి చూస్తే నల్లటి బూట్లతో ఒకడు రావడం కనిపించింది. దాంతో నేను చనిపోయినట్టు నటించాలనుకున్నాను. బాధతో అణచుకోవడానికి నా టైని మడతపెట్టి నోట్లో కుక్కుకున్నాను. ఆ వ్యక్తి ఎవరైనా బతికున్నట్టు కనిపిస్తే వారి శరీరాల్లోకి తూటాలు దించుతున్నాడు. నేను వీలైనంత స్థిరంగా, కదలకుండా పడుకున్నాను. కళ్లు గట్టిగా మూసుకుని.. మరోసారి నాపై కాల్పులకు సిద్ధమై వేచి చూడసాగాను. కానీ.. నా శరీరం వణికిపోతోంది. చావు నన్ను సమీపిస్తున్నట్లనిపించింది. నేను చావును ఎంత దగ్గరగా చూశానంటే.. నా జీవితంలో ఎప్పటికీ నన్ను సమీపిస్తున్న ఆ నల్లటి బూట్లను మర్చిపోలేను. అయితే, ఆ వ్యక్తి కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నేను కొద్దినిమిషాలపాటు అక్కడే కదలకుండా పడుకుండి పోయాను. ఆ తర్వాత పైకి లేవడానికి ప్రయత్నించాను. కానీ.. గాయాలవల్ల కింద పడిపోయాను. పాకుతూ పక్క గదివద్దకు వెళ్లాను. అక్కడ పరిస్థితి భయానకంగా ఉంది. మా స్కూలు ఆఫీస్‌ అసిస్టెంట్‌ మృతదేహం కాలిపోతూ కనిపించింది. కుర్చీలో కూర్చున్న ఆమె, కూర్చున్నట్టే ఉంది. కాలిపోతున్న శరీరం నుంచి రక్తం కారుతోంది. మా బడిలోనే పనిచేస్తున్న మరో సైనికుడి మృతదేహాన్ని కూడా చూశాను. అక్కణ్నుంచీ నెమ్మదిగా పాక్కుంటూ వెళ్లి తలుపుచాటున దాక్కున్నాను. అంతే.. స్పృహ తప్పింది. కళ్లు తెరిచేసరికి ఆస్పత్రిలో ఉన్నా..చావు అంటే ఏంటో దగ్గరి నుండి  చుసాను.. వాళ్ళని అల్లా కూడా క్షమించడు...వాళ్ళని నిజంగా అల్లా కూడా క్షమించడు..అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు..

దేశం ఏదైనా మతం ఏదైనా చిన్నారులు దేవుళ్ళతో సమానం అంటారు..అక్కడ మరణించిన చిన్నారుల ఆత్మ కి శాంతి చేకూరాలని అల్లా ని ప్రార్థిస్తూ..విశాల హృదయం తో   

-మన కామారెడ్డి 
Subscribe to this Mana Kamareddy Portal via Email :