Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Tuesday, April 21, 2015

Mana Kamareddy

తెలంగాణా రాష్ట్ర ప్రజల పిర్యాదులు, సౌకర్యాలు వివిధ సేవల కోసం టోల్ ఫ్రీ నంబర్లు.....



తెలంగాణా రాష్ట్ర ప్రజల పిర్యాదులు, సౌకర్యాలు వివిధ సేవలకు సంబంధించిన వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్లు...

104: గ్రామీణ ప్రాంతాలలో వైద్యసేవలను అందించేందుకు మొబైల్‌ వైద్య సర్వీసులను పిలిచేందుకు.

108: ఎక్కడైనా ఎవరైనా ఆకస్మికంగా ఆరోగ్య పరంగా ఇబ్బంది పడుతుంటే వారిని అత్యవసరంగా చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించాంటే వైద్యసేవలకోసం.

155361: ప్రభుత్వ కార్యాలయాలకు మీరు వెళ్ళినపుడు అక్కడ మిమ్నల్ని ఇబ్బందులు పెడుతున్నారా?

100: ఎక్కడైనా ఏదైనా కొట్లాట జరుగుతున్నదా.. శాంతిభద్రతలను కాపాడాలి అంటే.. ఇలా పలు నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని సద్వినియోగపరచుకుంటే ఎంతో ఉపయోగం.

101: ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే సంబందిత స్థలం, వంటి వివరాలతో ఫోన్‌ చేయాల్సిన నెంబరు

1090: శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు సరిగా పని చేయడంలేదా, దరఖాస్తులు ఇచ్చినా తీసుకోవడం లేదా అయితే పోలీసులపై ఫిర్యాదు చేయాలంటే ఎవరికి చేయాలో తెలియదా, అయితే ఫిర్యాదు కోసం.

1091: మీకు ఎక్కడైనా ఈవ్‌ టీజింగ్‌ దృశ్యాలు కనిపించాయా? వరకట్నం కారణంగా ఇబ్బందులు పడుతున్నారా? ఇటువంటి వాటితో పాటు అత్తమామల హింసలను, అకతాయిల అగడాలను గురించి సమాచారం కోసం..

1098: 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలపై వేధింపులు జరుగుతున్నాయా? ఎక్కడైనా తప్పి పోయారా వంటి వాటిపై సమాచారం ఇచ్చేందుకు.

1100: మీ సేవా కేంద్రాలు సరిగా పనిచేయడం లేదా? దరఖాస్తు చేసుకున్న ధృవ పత్రాలను నిర్ణీత సమయంలోగా ఇవ్వడం వంటి తదితర అంశాలపై ఫిర్యాదు కోసం.

133355: విద్యుత్‌ సమస్యలకు సంబంధించి సమాచారం కోసం..
.
1800-425-3536: రైతులకు పంటసాగులో సమాచారం కోసం..

155321: ఉపాధి హామీ పధకంలో కూలీలకు అన్యాయం జరుగుతోందా? కూలీ డబ్బులు ఇవ్వడం లేదా అయితే..

1800-180-5232: తపాల బీమాలో చేరాలనుంకటే వివిధ వివరాలకు..

1500: బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌ ఫోన్లకు సంబంధించిన సమాచారం కోసం..

1800-200-4599: ఆర్టీసీ బస్సులు సమయానికి రాకపోయినా, బస్సులలో ఏవైనా ఇబ్బందులు ఉన్నా.

96660 23456: ఆన్‌లైన్‌ గ్యాస్‌ బుకింగ్‌ కోసం


Subscribe to this Mana Kamareddy Portal via Email :