శ్రీరాముడు నడయాడిన ప్రాంతం..
కందకుర్తి గ్రామానికి యుగయుగాల చరిత్ర ఉన్నది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేస్తూ ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన నడయాడిన ప్రాంతం కావడంతో ఇక్కడ పురాతన రామాలయం ఉంది. పాలరాతితో ఉత్తరభారత శైలిలో నిర్మించిన సీతారామలక్ష్మణ ఆంజనేయ విగ్రహాలున్నాయి. ఆలయం శిథిలావస్థకు చేరడంతో పక్కనే మరో ఆలయాన్ని నిర్మించి ఆ విగ్రహాలను నూతన మందిరంలో ప్రతిష్టించారు. అయోధ్యకు చెందిన సీతారామ్ సేవాసమితి శ్రీరామచంద్రుడు అయోధ్య నుంచి శ్రీలంక వెళ్లిన రూట్‌ను వివరిస్తూ ఒక మ్యాప్‌ను ఇక్కడ ప్రదర్శించారు.రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవరావ్ హెడ్గేవార్ పుట్టింది కందకుర్తిలోనే..
డాక్టర్ కేశవరావ్ బలిరాం హెడ్గేవార్.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకుడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను ప్రారంభిచారయన. అయన పూర్వీకుల స్వస్థలం కందకుర్తి. హెడ్గేవార్ జన్మించక పూర్వం ఆయన కుటుంబం నాగ్‌పూర్‌కు వలస వెళ్లింది. వీరి వంశస్తులు ప్రస్తుతం నిజామాబాద్‌లో నివాసముంటున్నారు. హెడ్గేవార్ ఇంటిని కూల్చేసి అక్కడ కేశవనిలయం అనే భవనాన్ని స్మృతి మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్మృతి మందిరంలో హెడ్గేవార్, కేశవుడు, భారత మాత విగ్రహాలు ఏర్పాటు చేశారు. కేశవ సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ చరిత్ర కారుడు కందకుర్తి యాదవరావు చెబుతున్నారు.ఇంతటి మహానీయ చరిత్ర గల కందకుర్తిలో గోదావరి పుష్కర శోభ వెల్లివిరియాలని కోరుకుంటూ..
కందకుర్తి గ్రామంపై ఈ స్పెషల్ వీడియో చూడండి. అలాగే క్రింది ఆర్టికల్ కూడా చదవండి.
Click on image for bigger view |