Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Tuesday, July 14, 2015

Mana Kamareddy

ఒక ఆయనకి బాహుబలి సినిమా నచ్చలేదంట!! ఎందుకో చూడండి..


అవును భయ్, నాకు బాహుబలి సినిమా అసల్కే నచ్చలేదు. నచ్చలేదంటే  నచ్చలేదు అంతే. జర తిట్టుడు షురువు చెయ్యొద్దు  ఆగుండ్రి  ఎందుకు నచ్చలేదో లెక్కలేసి మరీ జెప్త.. ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది కారణాలను ఒక్కొక్కటినిపిస్త మీరూ వినుండ్రి.  విన్నాక జెపుండ్రి  మీరే,  నేను జెప్పింది కరెక్టో కాదో.

నెంబర్ 1:
స్క్రీన్ మీద  పేర్లు పడేటప్పుడు  ఎలా ఉండాలి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఓ తీస్మార్ ఖాన్, తోపు , తురుము హాం.. ఢాం .. భాం అని ఉండాలె… అప్పుడు గద ఈలలు , గోలలు వచ్చేది. ఫ్చు…..పేర్లు పడేటప్పుడు హీరో ఇంట్రడక్షన్ల జల్లుదామనుకొని  నే చించుకొచ్చిన కాగితాలన్నీ వేస్ట్ అయినయ్.

నెంబర్ 2 :
సినిమా మూడేళ్లు తీస్తరా… అరె రామ్ గోపాల్ వర్మ దొంగలమూఠ  లెక్క  అయిదు రోజుల్లో  సినిమా తీసినా నేను చూస్తగదా.. దానికి మూడేళ్లు తీసుడు. అందులనే ఆయన ఇంత లావు పెరిగిండు, ఈయన ఇంత తగ్గిండు ఇదంతా ఎందుకు భయ్… నేను సినిమా జూడనికి వచ్చిననా.. లేక వాళ్ల బరువులను కొలవనికి వచ్చిననా? నాకే సమజ్ అయితలేదు.

నెంబర్3 :
బిల్లా సినిమాలో బికినిలో ఉన్న అనుష్కను జూసినోడి చేతనే చినిగిన చీర కట్టిన అనుష్కను జూపించిండ్రు ఇదేమన్నా న్యాయమా మీరే జెప్పుండ్రి. అరె ఆమె డై హర్ట్ ఫ్యాన్ని నేను, నాకే హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది ఆమెను అలా చూసి.

నెంబర్ 4 :
నాయనా జక్కన్న ఆ చెక్కుడు అవసరమా మనకి కట్టె, కొట్టే,  తెచ్చే…. లాగా చూపించాల్సిన మాయిశ్మతీ రాజ్యాన్ని…డండడాం… డరడరడరడరడర డండంఢాం అంటూ అబ్బో  బబ్బిలీకం లాగా సాగదీసి సాగదీసి సంపిండు ఆ డైరెక్టర్ సారు అవునా కాదా?

నెంబర్ 5:
గంత బడ్జెట్ ఎందుకు ఆయుధాల పాలు , సెట్టింగ్ ల పాలు  జేసిండ్రో నాకైతే  అర్థం కాట్లేదు… అరె సీన్ ల కోసం బల్గేరియా పోవాల్నా… మా గండిపేట చెరువో, మా ఊరి గుట్టల్నో, ఖమ్మం అడవుల్నో, ఈఖాఖపట్నం ఒడ్డున నో తీస్తే పోదు, అదిరిపోదు.

నెంబర్ 6:
హీరో తో గవేవో అర్థం గాని  డైలాగ్ లు జెప్పించుడెందుకు…  గుద్దుతా, సంపుతా, నరుకుతా, తొడకొడతా, ఛాలెంజ్, సూసుకుందాం.. అహె ఖబర్థార్ లాంటి డైలాగ్ లే లేకపాయె…   అసలు ప్రభాస్, రానాలు  మాట్లాడింది తెలుగా? లేక సంస్కృతమా సమజ్ గాలె!

నెంబర్ 7:
లైన్ల నిలబడి, తోసుకొని, తోసుకొని,  పోలీసు దెబ్బలు తిని,  చివరాఖరుకి సినిమా చూస్తుంటే 300 మంది యోధులది కొంత, మగధీర ది కొంత, కన్నడ మయూరిది కొంత అతికించి జూపిచ్చురు.. దీని బదులు ఈ సీన్ లింకు ఇది , ఆసీన్ లింక్ ఇది అని ఇస్తే వచ్చి యూట్యూబ్ లా జూసుకునే వాడిని కదా!

నెంబర్ 8:
కామెడీ, కామెడీ ఎక్కడ..?  అరె అల్లరి నరేష్ సినిమాలు  కలెక్షన్ల వరద పారించడానికి కారణమే  కామెడీ. అంతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కామెడీని నువ్వు  ఎట్టా పక్కన పెట్టావ్ !  గింత పెద్ద సినిమా తీసి బ్రహ్యనందాన్నో, ఆలినో ఆఖరికి సప్తగిరి నో వాడుకోవొచ్చు కదా.

నెంబర్ 9:
ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే అటువంటి పాట కానీ, ఆ.. అంటే అమలాపురం లాంటి ఊపు ఉన్న సాంగ్ ఒక్కటైనా ఉందా.. అంత బడ్జెట్ పెట్టినవ్ కానీ ముమ్మైత్ ఖాన్నో, మల్లికా శెరావత్ నో, సన్నీ లియోన్ తోనో ఓ ఐటమ్ సాంగ్ జేయిస్తే అదిరిపోయేది కాదో….!

ఇగో ఇవి నా కారణాలు నాకెందుకు బాహుబలి నచ్చలేదో జెప్పడానికి మీరేమంటారు.అవునా కాదా! దయచేసి తిట్టకండ్రి నా ఇంటన్షన్ అర్థం చేసుకోండి. పోయి దోస్తును కలవాలే  ఛాయ్ తాగనికి.

ఇట్లు.
తోపు ఖాన్ ( ఓ మంచి విమర్శకుడు)


Subscribe to this Mana Kamareddy Portal via Email :