Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Monday, August 10, 2015

Mana Kamareddy

నేను ముస్లింని, మీరు నన్ను నమ్మేట్టయితే వచ్చి నన్ను కౌగిలించుకోండి!!


ముంబై మహా నగరంలో గేట్ వే ఆఫ్ ఇండియాకు దగ్గరలో ఓ ఫుట్ పాత్ పై ఓ యువకుడు కళ్ళకు గంతలు కట్టుకొని,ప్లకార్డ్ పక్కన పెట్టుకొని నిలబడి ఉన్నాడు. ఆ ప్లకార్డ్ పై ʹనేను ముస్లింని, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరూ నన్ను నమ్మేట్టయితే వచ్చి నన్ను కౌగిలించుకోండిʹ అని వుంది.ఫుట్ పాత్ పై తిరిగే  చాలా మంది చుట్టూ చేరి  ఆ ప్లకార్డ్ పై వున్నది చదువుతూ అతన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంతలో ఒక యువకుడు వచ్చి అతన్ని కౌగిలించుకున్నాడు, ఆ తర్వాత ఆ యువకున్ని చూసి చాల మంది  అడ మగ తేడాలేకుండా అతన్ని కౌగలించుకుంటూన్నారు. మరికొందరు అతనితో మాట్లాడారు. కొందరు అతనితో ఫోటోలు దిగారు... ఇంతకి అతని పేరు ఏమిటంటే మాజిమ్ ముల్లా .

ఈ సంవత్సరం మొదట ఒక  కెనడియన్ యువకుడు కూడా ఇలాంటి పనే చేసాడు. అది మాజిమ్ ను చాల ప్రభావితం చేసింది. అప్పట్లో ఆ కెనడియన్ యువకుడు ఇలాగే కళ్ళకు గంతలు కట్టుకొని చేపట్టిన కార్యక్రమం సంచలనం సృష్టించింది. పాలించేవారు, ముస్లింలపై టెర్రరిస్టులంటూ ముద్రవేయడం, ప్రపంచమంతా వారిని అనుమానంగా చూడటాన్ని తట్టుకోలేకే ఆ కెనడా యువకుడైనా, ముంబైలో మాజిమ్ అయినా ఇటువంటి ప్రయోగానికి సిద్దమైనారు. వాళ్ళు కోరుకున్నట్టే వాళ్ళిద్దరికీ మంచి మద్దతే లభించింది. మాజిమ్ ముల్లా చేసిన పని మాత్రం భారతీయులంత ఒక్కటే అనడానికి ఒక సాక్షంగా నిలిచింది. ఆ వీడియో మీకోసం..
This is our India!!

భారతీయులంత ఒక్కటే అనడానికి సాక్షమే ఈ వీడియో!!This is Our #IndiaA Blind-folded Muslim Man From Mumbai Asked For Free Hugs. Watch How People Reacted.

Posted by Mana Kamareddy on Sunday, August 9, 2015


Subscribe to this Mana Kamareddy Portal via Email :