Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Thursday, August 27, 2015

Mana Kamareddy

ఒకే ఒక్కడు వణికించాడు..



తమ కులానికి రిజర్వేషన్ కల్పించి ఓబిసి లో చేర్చాలని డిమాండ్ చేస్తూ 21 ఏళ్ళ యువకుడు ప్రారంభించిన ఉద్యమం, దేశం మొత్తాన్ని ఆకర్షించింది. అయన పేరే హర్ధిక్ పటేల్. గుజరాత్ రాష్ట్రం లోని ఆర్థికంగా బలమైన పటేల్ సామాజిక వర్గానికి చెందిన ఈ యువకుడు తమ కులానికి రిజర్వేషన్ కల్పించి  ఓబిసి లో చేర్చాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా కేంద్రంగా ప్రారంభించిన ఉద్యమం తార స్థాయికి చేరి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని గడ గడ  లాడించింది. హార్దిక్ పటేల్ ఆధ్వర్యంలో సుమారు 5 లక్షల మందితో నిర్వహించిన  పట్టిదారి మహా క్రాంతి ర్యాలీ, యావత్ దేశాన్ని తన వైపుకు చూసేలా చేసింది. సోషల్ మీడియాలైన ఫేస్బుక్, వాట్స్అప్ ల సహాయంతో లక్షలమందిని ఒక్క తాటి పై తెచ్చిన తీరు ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా ప్రాధాన్యతను చెప్పకనే చెప్పాడు హార్దిక్ పటేల్.

ఈ కులాల గొడవలు, రిజర్వేషన్ గొడవలు కాసేపు పక్కన పెడితే, యువకుడుగా హర్ధిక్ పటేల్ చేసిన ఉద్యమం యావత్ యువతకు స్ఫూర్తి గా నిలిచిందనటంలో ఏమాత్రం సందేహం లేదు. 


Subscribe to this Mana Kamareddy Portal via Email :