Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Sunday, August 16, 2015

Mana Kamareddy

తెలంగాణా ఎన్ఆర్ఐ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూయార్క్ నగరంలో ఘనంగా ఇండియా ఇండిపెండెన్స్ పెరేడ్..


స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణా ఎన్ఆర్ఐ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఇండియా ఇండిపెండెన్స్ పెరేడ్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలు వుట్టి పడే విధంగా తెలంగాణా శకటాన్ని తయారు చేసి నగర వీదుల్లో డప్పు దరువుల మధ్య జాతీయ జెండాను చేత బట్టి ఊరేగింపు చేసారు. ఈ కార్యక్రమంలో శకటంలో ఉన్న తెలంగాణా అమరవీరుల స్థూపానికి అలాగే స్వాతంత్ర్య సమరయోధులకు, అమర జవానులకు అంజలి ఘటించి కార్యక్రమం కొనసాగించారు. ఈ సందర్భంగా మహిళలు తెలంగాణా బతుకమ్మలతో ఊరేగింపులో పాల్గొనటం పలువురిని ఆకర్షించింది. ఈ సందర్భంగా ఒక ప్రవాస భారతీయుడు మన కామారెడ్డి పోర్టల్ కి కొన్ని ఫోటోలను ప్రత్యేకంగా పంపించాడు. వాటిని మీ కోసం ప్రత్యేకంగా పబ్లిష్ చేస్తున్నాం..













Subscribe to this Mana Kamareddy Portal via Email :