Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Monday, August 03, 2015

Mana Kamareddy

దోమకొండ లో ఘనంగా మహంకాళి బోనాల ఉత్సవాలు..


దోమకొండ మండల కేంద్రంలో శ్రీ మహాకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సంధర్బంగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మ వారికి బోనాలు సమర్పించి తమ తమ మ్రొక్కులు తీర్చుకున్నారు. బోనాల సంధర్బంగా దోమకొండ పట్టణం సందడిగా మారింది.



ఈ ఉత్సవాలలో కామారెడ్డి ఏం ఎల్ ఏ గంప గోవర్ధన్ గారు పాల్గొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసారు. ఈ సంధర్బంగా అయన మాట్లాడుతూ దోమకొండ లో జరుగుతున్న బోనాల ఉత్సవాలు సికింద్రాబాద్ మహంకాళి బోనాలని మరిపించే విధంగా వున్నాయని అన్నారు. ఏం ఎల్ ఏ తో పాటు పలువురు నాయకులు ఉత్సవాలలో పాల్గొన్నారు. ఉత్సవాలలో భాగంగా రంగసాని ఆధ్వర్యంలో రంగం కార్యక్రమం జరిగింది.
Image Source: Sakshi


Subscribe to this Mana Kamareddy Portal via Email :