మలావత్ పూర్ణ..కృషి, పట్టుదలకు మారు పేరైన ఈ మన నిజామాబాదు జిల్లా ముద్దు బిడ్డ. చిన్న వయసులో ఎవరెస్ట్ అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది పేద విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన ఆమె ప్రతిభను ఇప్పుడు ఐక్యరాజ్య సమితి సైతం గుర్తించింది. ఐక్యరాజ్య సమితి వేదికపై ప్రసంగించే అరుదైన అవకాశాన్ని ఈ చిన్నారికి కల్పించింది.
అత్యంత పేద గిరిజన కుటుంబంలో పుట్టిన మలావత్ పూర్ణ స్వగ్రామం నిజామాబాద్ జిల్లా పాకాల గ్రామం. ఈమె సంకల్ప బలం ముందు ఎవరెస్టు శిఖరం సైతం తలవంచింది. సాంఘిక సంక్షేమశాఖ సహకారంతో భారత జెండాను ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు శిఖరాగ్రంపై ఎగురవేసింది పూర్ణ. టీఎస్, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ, ఫ్రాన్స్ అడ్వెంచర్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ విద్యార్థిని ఆ సాహస యాత్రను పూర్తి చేసింది. ఒకవైపు చదువులో దూసుకెళుతూ మరోవైపు స్పోర్స్ట్లోనూ రాణిస్తోంది. తనదైన శైలిలో విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ విజయపరంపర కొనసాగిస్తోంది.
ఈ ఏడాది ఐక్యరాజ్య సమితిలో 'భారత్లో పేదరికం' అనే అంశంపై ప్రసంగించేందుకు పూర్ణకు ఆహ్వానం అందింది. అలాగే బాలల దినోత్సవం రోజు, భారత ప్రధాని నరేంద్రమోడీని కలిసే అవకాశాన్నికూడా పూర్ణ పొందింది. ఐక్యరాజ్య సమితి నుంచి పిలుపు అందుకున్న మలావత్ పూర్ణ అందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించింది. ఇంతటి అవకాశం రావడానికి కారణం తమ తల్లిదండ్రులు ఇచ్చిన ధైర్యం, సాంఘిక సంక్షేమ గురుకులాల సెక్రటరీ ప్రవీణ్ కుమార్ సార్ ప్రోత్సహమే అంటోంది పూర్ణ. ఇంతటి అరుదైన ఖ్యాతి సాధించిన మలావత్ పూర్ణకు అభినందనలు తెలుపుతూ..
- మన కామారెడ్డి