కామారెడ్డిలో వినాయక నవరాత్రులలో భాగంగా ఏర్పాటు చేసిన రైతు వేషంలో వున్నగణపతి ప్రజలను బాగా ఆకట్టుకుంటోంది. పట్టణంలోని, రామ్ మందిర్ దగ్గర బ్యాంగ్ అనే గణేశ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు గణపతి, దేశ వ్యాప్తంగా కష్టాల్లో వున్న అన్నదాతను గుర్తుచేస్తున్నట్లుగా ఉంది.