శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు ఈ నెల తేది 30-11-2015 నుండి తేది 04-12-2015 వరకు సదాశివనగర్ మండలం, ఇస్సన్నపల్లి (రామారెడ్డి)లో ఘనంగా జరుగనున్నాయి. వేడుకలలో భాగంగా తేది 01-12-2015 మంగళవారం రోజు సాయంత్రం 6-00 గంటలకు లక్షదీపార్చన, తేది 03-12-2015 గురువారం రోజు స్వామి వారి దోలారోహానము మరియు రాత్రి 2:00 గంటలకు రథోత్సవము, అలాగే తేది 04-12-2015 శుక్రవారం రోజు ఉదయం 6-00 గంటలకు అగ్ని గుండములు మొదలగు కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఈ సందర్బంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారి అనుగ్రహం పొందగలరని ఆలయ మేనేజర్ తెలిపారు.