Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Friday, November 13, 2015

Mana Kamareddy

పురాణాలలో మన తెలంగాణా ప్రాంత నేపథ్యం..!


భారత దేశానికి ప్రపంచంలో ఎంత చరిత్ర కలదో తెలంగాణ కు కూడా అంతే చరిత్ర కలదు. ఆ చరిత్ర ఏమిటంటే….. !
వివాహాది శుభ కార్యాలలో బ్రహ్మనోత్తములచే “జంబూద్వీపే భరత ఖండే దక్షిణ పదే అస్మకం” అనే శ్లోకం వింటునే వుంటున్నాం ఈ అస్మక ప్రాంతమే తెలంగాణా ప్రాంతం .
  • కృత యుగం (వేదకాలం) లో జంబూద్వీపం నుండి హిమాలయాలకు వెళ్ళే ఋషులు ఆర్మూర్ లోని నవ నాథుల సిద్ధుల గుట్ట వద్ద ,మునులు మొర్తాడ్ మండలం లోని మునుల గుట్ట వద్ద విశ్రాంతి తీసుకొని హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకునేవారు.ఇలాంటి ప్రాంతాలు తెలంగాణలో కలవు.
  • త్రేతాయుగం లో ఈ ప్రాంతం దండకారణ్యంగా పిలువబడేది. ఈ యుగం లో శ్రీరాముడు ,సీతమ్మ,లక్ష్మణుల సమేతంగా అయోధ్య నుండి త్రివేణి సంగమంనకు వచ్ఛారు.ఆనతి ఆ త్రివేణి సంగమమే నేటి రెంజల్ మండలం లోని కందకుర్తి గ్రామము. ఈ త్రివేణి సంగమం తెలంగాణా లో వుండడం తెలంగాణా వారికెంతో పుణ్యఫలం. శ్రీరాముడు ,సీతమ్మ,లక్ష్మణులు గోదావరి నది తీరం వెంబడి వెళ్తు ఖమ్మంలోని భద్రాచలం లో కొలువైనారు. అదే కాలం లో రత్నాకరుడనే గజ దొంగ నారదుని చేత జ్ఞానోదయం పొంది వాల్మీకి గ మారి రామాయణ మహా కావ్యాన్ని రచించాడు .అతడు జ్ఞానోదయం పొందిన ప్రాంతమే నవీపేట్ మండలం లోని కస్పబినోల గ్రామము. నేటికి ఇచ్కాత వాల్మీకి సమాధి కలదు.అతడు “కృషి వుంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషు లవుతారు” అనే వాక్యం నిజం చేసినారు. వాల్మీకి తెలంగాణా ప్రాంత వాసి కావడం ఈ ప్రాంత ప్రజల కెంతో గర్వ కారణం.

  • ద్వాపర యుగం లో పాండవులు హస్తినాపురం (డిల్లీ) నుండి అజ్ఞాత వాసంలో దక్షిణ భారత ప్రాంత మైన అస్మకం చేరినారు. ఈ ప్రాంతం లో బకాసూరుడనే రాక్షసుడు తిని,త్రాగి ప్రజలను హింసిస్తుండే వాడు. ఆ రాక్షసుణ్ణి భీముడు చంపినాడు. ఆ నాటి ఆ ప్రాంతమే నేటి భోధన్ లోని రాకాసి పేట్. నేడు దీనిని భీముని గుట్ట అంటున్నారు. పాండవులు ఈ ప్రాంతం రావడం ఇక్కడి వారి అదృష్టం . ఇదే యుగం లో మహా భారత రచయిత వ్యాస మహర్షి కాశీనుండి తీర్ద యాత్రలు చేస్తూ అస్మకం ప్రాంతం చెంత గోదావరి తీర ప్రాంతమందు జ్ఞానానికి ప్రతిరూపమైన సరస్వతీ మాత ని ఆదిలాబాద్ లో ప్రతిష్ఠాపన చేసినారు. నాటి వ్యాసపురి ఐన వాసర క్షేత్రం నేడు బాసర గ ప్రసిద్ది చెందినది. వ్యాసుడు తెలంగాణా ప్రాంతం లో జ్ఞాన సరస్వతీని ప్రతిష్ఠాపన చేయడం తెలంగాణా ప్రజలకు మహా వరం లాంటిది.
  • క్రీ.పూర్వము 6వ శతాబ్దము గౌతమ బుద్దుని పరిపాలనలో అఖండ భారత షోడశమహాజన పదా(౧౬ రాజ్యాలు) లతో ఆర్థిక రాజకీయ నైతిక మరియు సాంస్కృతిక రంగాలలో అత్యంత వైభవంగా ప్రపంచానికే ఆదర్శంగా ఉండేది . ఈ షోడశ మహా జన పదాలుగకాంభోజ,గాంధార,కురు,మత్స్య,శూరుసేనా,పాంచాల,కోసల,మల్ల,చెడి,వాత్సల,కాశి,వజ్జీ,అంగ,మగధ, అంతి మరియు అస్మక ౧౬ జన పదాలలో ౧౫ ఉత్తర భారత దేశం లోఉంటే అందులో ఒకే జానపదం “అస్మక” దక్షిణ భారత దేశం లో గోదావరి కృష్ణ నదుల మద్య ఉండేది. ఈ ప్రాంతపు గొప్ప పరిపాలన గురించి గ్రీకు రాజి న అలెగ్జన్దర్ రాయబారి మెగస్తనీస్ తనచే వ్రాయబడిన “ఇండికా” అనే గ్రంధం లో పేర్కొన్నారు. ఈ అస్మక ప్రాంతం అపారమైన జల వనరులు(చెఱువులు) విస్తారమైన అటవీ సంపదతో నా తెలంగాణా కోటి రతనాల వీణగా చరిత్రలో నిలిసినది. ఇతర దేశాలైన గ్రీకు,రోమ్,చైనా,మెసపటోమియా,హిబ్రూ,జేరుసలెం లాంటి ప్రపంచదేశాలతో స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నది.
  • ఆసియా ఖండం లో నే అతిపెద్ధదైన నిజాంషుగర్ ఫ్యాక్టరీ వ్యవసాయంలో అగ్రగామిగా ఉండేది . చారిత్రాత్మక కట్టడాల తో పాటు హిందూ, జైన, బౌద్ధ, ఇస్లాం మతాలతో భిన్నత్వం లో ఏకత్వంగా ఉండేది. భౌగోళిక పరంగా ఈ ప్రాంతం “దక్కన్’ ప్రాంతంగ వర్ణించబడింది.ఉర్దూ లో దక్కన్ అంటే మూట లేదా ఎత్తైన ప్రాంతం . నాటి నుంచి నేటి వరకు తెలంగాణా ప్రాంతంలో అనేక ఉర్దూ పదాలు (దావఖాన,సడక్,) అగుపడుతున్నవి. అలాంటి ఒక ఉర్దూ పదమే “లష్కర్” .లష్కర్ అంతే తెలుగు లో సైనిక స్థావరం,ఇంగ్లీష్ లో “కంటోన్మెంట్”
  • స్వాతంత్ర్యానికి పూర్వం యావత్ భారత దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తుంటే ఆపారమైన వనరులున్న దక్కన్ ప్రాంతాన్ని నైజాం పరిపలిస్తుండే వాడు . దక్కన్ ప్రాంతాన్ని ఆంగ్లేయుల ఆధీనం లోకి వెళ్ళకుండా నైజాం తన సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని సికింద్రాబాద్ ప్రాంతాన్ని లష్కర్ ప్రాంతంగా ఏర్పాటు చేసినాడు.లష్కర్ అంటేనే సైనిక స్థావరం . ఈ సైన్యం లో ఉన్నా సైనికులు తమ విధి నిర్వహణలో నిర్భయంగా ఉండాలి . ఈ నిభాయత్వం సింహం లో అగుపడుతున్నది.సింహం మహంకాళి యొక్క వాహనం కావున సైన్యం లోని ప్రతీ సైనికుడు సింహం లాగ ఉండడానికి మహంకాళి ని పూజించారు. బోనం అంటే ఘటిక తో తయారు చేయబడిన ప్రసాదం. నాటి లష్కర్ సికింద్ర బాద్ లోని మహంకాళి కి బోనం పెట్టి లష్కర్ బోనాల పండుగ జరుపుకొని ఆంగ్లేయుల పాలనను అడ్డుకున్నారు.



Subscribe to this Mana Kamareddy Portal via Email :