Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Monday, February 08, 2016

Mana Kamareddy

గూగుల్ టు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్!కార్పోరేట్ జాబ్ వదిలి కార్పొరేటర్ అయింది... హైదరాబాద్ చరిత్రలోనే రికార్డు మెజారిటీతో విజయ దుందుభి మోగించింది... గూగుల్ నుంచి హైదరాబాద్ కార్పొరేషన్ కొచ్చి చిన్న వయసులో కార్పొరేటర్ అయి చరిత్ర సృష్టించింది సామల హేమ అనే ఈ యువ ఇంజనీర్.

సీతాఫల్‌మండి కార్పొరేటర్ సీటు డాడీకే అని అందరూ అనుకుంటున్నారు. ఆరోజు నేను నైట్‌డ్యూటీ చేసి వచ్చి పడుకున్నా. డాడీ అన్నయ్యకు కాల్ చేసి హేమ డీటెయిల్స్ తీసుకురా అన్నారు. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి మమ్మీ పద్మారావు సార్ ఇంటికి రా తొందరగా అన్నారు. అప్పటికి కూడా తెలియదు నన్నే అభ్యర్థిగా డిసైడ్ చేశారని. నాకు చెప్పగానే భయమైంది. గెలుస్తానన్న నమ్మకం ఉంది. కానీ ఇంత మెజార్టీతో ఆదరిస్తారని ఊహించలేదు అంటూ గూగుల్ ఉద్యోగం వదిలేసి చిన్న వయసులో కార్పొరేటర్‌గా ఎన్నికైన సామల హేమ చెప్తోంది. 

కార్పోరేట్ జాబ్ టు కార్పొరేటర్!


హేమ చిన్నప్పటి నుంచి స్లమ్ ఏరియాలోనే పెరిగింది. సీతాఫల్‌మండి ఏరియాలో తమలాగే పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఉండడంతో ఎన్నికల్లో జనాలతో కలిసిపోవడానికి హేమకు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. అందరినీ అన్నా... అక్కా... అమ్మా.. అంటూ ఆప్యాయంగా పలకరించే మనస్తత్వం ఆమెది. ఏడు నెలల క్రితం గూగుల్‌లో జాబ్ వచ్చింది. అంతకు ముందు జెన్‌పాక్ట్‌లో ఉద్యోగం చేసింది. జాబ్ చేస్తూనే కీసరలోని అశ్విత్ జీజస్ కాలేజ్‌లో ఫైనాన్స్‌లో ఎంబీఏ చేసింది. తాజాగా గూగుల్‌లో చేస్తూ టీమ్‌లీడర్‌గా ప్రమోషన్ వచ్చే టైమ్‌లోనే ఎలక్షన్‌లో పోటీ చేసే అవకాశం వచ్చింది. 

కార్పోరేట్ జాబ్... ఐదంకెల జీతం వదులుకుని కార్పొరేటర్ ఎన్నికల బరిలో నిలిచింది. చిన్న వయసులో రాజకీయ అరంగ్రేటం చేసి, హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించింది హేమ. హెల్పింగ్ హ్యాండ్స్ అనే పేరుతో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఓ గ్రూప్‌గా ఫామ్ అయి స్లమ్ ఏరియాల్లో సేవా కార్యక్రమాలు చేసేది. యూఎస్‌లో ఎమ్మెస్ చేద్దామన్న ఆలోచనతో గూగుల్ ఉద్యోగానికి లాంగ్‌లీవ్ పెట్టింది. కానీ ఈ గ్యాప్‌లోనే ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం రావడం, కార్పొరేటర్‌గా పోటీచేసి, చూస్తుండగానే చరిత్రాత్మక విజయం సాధించడం అంతా చూస్తుండగానే జరిగిపోయింది. 


నా ఓటు నాకే..


మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఓటు కోసం ఐప్లె చేసుకున్నా. బట్ ఓటరు జాబితాలో నా పేరు రాలేదు. దీంతో ఓటు వేయలేకపోయిన. ఎలక్షన్స్ అయిపోయాక ఓటు హక్కు వచ్చింది. ఓటు హక్కు వచ్చిన తర్వాత నా మొదటి ఓటు హైదరాబాద్‌కు వేస్తా అనుకున్నా కానీ... విచిత్రంగా నా ఓటు నాకే వేసుకున్న. ఇది విచిత్రంగా ఉన్నప్పటికీ ఎగ్జయిటింగ్‌గా ఉన్నది అంటూ తన తొలి ఓటును తనే వేసుకున్న అనుభవం పంచుకుంది. ప్రచారంలో అమ్మా... అన్నా... మీ ఓటు నాకే అంటూ దూసుకెళ్లి తన మొదటి ఓటును కూడా తనకే వేసుకున్నది హేమ. కరాటే రాజు కూతురుగా అందరికీ పరిచయమైన హేమ ఇక నుంచి కార్పొరేటర్ హేమగా ప్రజల్లోకి వెళ్లి తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తా అంటోంది.

నీకెందుకు దయ్యం అన్నడు..


నాన్న అర్జంటుగా ఫోన్ చేస్తే... మినిస్టర్ పద్మారావ్ అంకుల్ ఇంటికి వెళ్లా. అప్పటికే నన్ను కార్పొరేటర్ అభ్యర్థిగా డిసైడ్ చేశారంట. అప్పటిదాకా ఆ విషయం తెలియదు. అంతకు ముందు చాలాసార్లు పద్మారావు అంకుల్ ఏం చేద్దామనుకుంటున్నవ్ మమ్మీ అని అడిగారు. యూఎస్ వెళ్దామనుకుంటున్నా అని చెప్పా. యూఎస్ వెళ్దామనుకునేదానివి నీకెందుకు దయ్యం ఈ పాలిటిక్స్? అన్నడు. అప్పుడర్థమైంది నన్ను డాడీ ఎందుకు పిలిచాడో. 

ప్రజలకు సేవచేసే అవకాశం రావడం గొప్ప విషయం కదా.. మీ సపోర్ట్ ఉంటే రాణిస్తా అన్నా. నవ్వుతూ వెన్నుతట్టి ప్రోత్సహించారు. ప్రచారం ఎలా చేయాలి. ప్రజలతో ఎలా ప్రవర్తించాలి... అనే విషయాలు ఓపికగా చెప్పారు. చిన్నపిల్లవు కదా... మెల్లగా అన్నీ తెలుసుకుంటవ్‌లే. చదువుకున్నవ్ కదా! అని ఎంకరేజ్ చేశారు. ఇప్పటి వరకు రాజకీయాలకు సంబంధించిన ఫంక్షన్లకు, ప్రారంభోత్సవాలకు నాన్న తీసుకెళ్లేవారు. అలా కొన్ని కార్యక్రమాల్లో ఎలా ఉండాలో తెలుసుకున్నా. నాన్నకే కాదు... నాకు కూడా రాజకీయ గురువు పద్మారావు అంకులే అంటూ పెద్దలపై ఉన్న గౌరవాన్ని చాటి చెప్పింది హేమ. 

నేనుండేది కూడా కిరాయిల్లే!


బస్తీల్లో ఉండే ప్రజల బాధలు నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా బస్తీవాసినే. నేనుండేది కూడా కిరాయింట్లోనే. నీటి కొరత, డ్రైనేజ్ సమస్య బస్తీల్లో ఉండే ప్రధాన సమస్యలు. బస్తీల్లో డే బై డే వాటర్ సైప్లె ఉంటది. ఎండాకాలం అయితే నీటి కొరత వల్ల పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ట్యాంకర్ వస్తే నీళ్ల కోసం కాలనీలు చిన్నపాటి యుద్ధక్షేత్రాన్నే తలపిస్తాయి. కొన్నిసార్లు ఆ యుద్ధభూమిలో నేను కూడా సైనికురాలిగా ఉన్నా (నవ్వుతూ). అందుకే కేసీఆర్‌గారు ప్రవేశపెట్టిన ఇంటింటికీ నల్లా, స్వచ్ఛ హైదరాబాద్‌తో డ్రైనేజీ సమస్య లేకుండా పనిచేస్తా. అవసరమైతే దీనికోసం యూత్ సపోర్ట్ తీసుకుంటా. ప్రచార సమయంలో ఇచ్చిన వాగ్దానాలే కాకుండా... ఇవ్వని వాగ్దానాలు కూడా తీర్చేందుకు అంకితభావంతో పనిచేస్తా. స్కూల్స్, రోడ్స్, యూత్‌కి ఉపాధి లాంటి అంశాలకు సంబంధించి మా నియోజకవర్గ మంత్రి పద్మారావు గారి సహాయం తీసుకుంటా. ప్రభుత్వ పథకాలను ఫాలో అవుతూ, బంగారు తెలంగాణ నిర్మాణానికి ాళ్లెత్తే ూలినవుతా. 


గూగుల్ కదా!అన్నారు...


గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్ గారిని కలవడానికి వెళ్లినప్పుడు పద్మారావుగారు నన్ను సీఎం గారికి పరిచయం చేశారు. అప్పుడు నన్ను చూసి కేసీఆర్ గారు గూగుల్ కదా! అన్నారు. ప్రచారంలో కేటీఆర్‌గారు వచ్చినప్పుడు ఆయనతో సెల్ఫీ తీసుకున్న. సెల్ఫీలే దిగుతున్నవా..? ప్రచారం కూడా చేస్తున్నవా? అన్నరు. బాగా ప్రచారం చేస్తున్నవటగా! అని మెచ్చుకున్నరు. ఇన్ని రోజులు నన్ను చూసి కరాటే రాజు కూతురు అనేవారు. ఇప్పుడు కార్పొరేటర్ హేమ వాళ్ల నాన్న అని డాడీ గురించి మాట్లాడుతున్నరు. కొత్తగా అనిపించినా, తెలంగాణ సర్కార్‌లో భాగమైనందుకు గర్వంగా ఉంది. కేసీఆర్ ఆలోచనా తీరు అద్భుతం. భావితరాల గురించి ఆలోచించి ఆయన తీసుకునే నిర్ణయాలు గొప్పగా ఉంటాయి. ఆయన చేసిందే చెప్తరు... చెప్పింది చేస్తరు. 


ఫేవ

రేట్స్ :
లీడర్- కేసీఆర్
ఫుడ్ - బెండకాయ కూర, ఫిష్
కలర్ - బేబీ పింక్ 
(అందుకే టీఆర్‌ఎస్ కార్పొరేటర్ అయ్యానేమో (నవ్వుతూ))
ఖాళీ సమయాల్లో - ఇంతకు ముందు ఫ్రెండ్స్‌తో ఉండేదాన్ని. ఇప్పుడు ఖాళీటైమ్ ఉండదేమో!
పొలిటికల్ గురువు - పద్మారావు గౌడ్

ఆర్టికల్ క్రెడిట్: నమస్తే తెలంగాణా Subscribe to this Mana Kamareddy Portal via Email :