Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Thursday, March 10, 2016

Mana Kamareddy

గడిచిన బాల్యాన్ని నేమరు వేసుకుంటూ...



ప్రతీది కృత్రిమంగా మారిన నేటి కాలంలో.. 
రోజులు బాగున్నాయ్...
ఆదివారం ఆటలాడుతూ అన్నాన్ని మరిచిన..
ఆ రోజులు బాగున్నాయ్...!
మినరల్ వాటర్ గోల లేకుండా..
నల్లా దగ్గర, బోరింగుల దగ్గర, బావుల దగ్గర నీళ్లు తాగిన ఆ రోజులు బాగున్నాయ్....!
ఎండాకాలం సలివేంద్రాల దగ్గర చల్లని నీళ్ల కోసం
ఎర్రని ఎండని సైతం లెక్క చేయని ఆ రోజులు బాగున్నాయ్....!
వందల కొద్దీ చానళ్ళు లేకున్నా, 
ఉన్న ఒక్క దూరదర్శన్ లో చిత్రలహరి,ఆదివారం సినిమా కోసం వారమంతా ఎదురుచూసిన ఆ రోజులు బాగున్నాయ్....!
సెలవుల్లో అమ్మమ్మ,నానమ్మ ల ఊళ్ళకు వెళ్లి 
ఇంటికి ఎప్పుడు రావాలన్న ఆలోచనే లేని ఆ రోజులు బాగున్నాయ్...!
ఏసి  కార్లు లేకున్నా 
ఎర్ర బస్సు లో కిటికీ పక్క సీట్లో నుండి ప్రకృతిని ఆస్వాదించిన ఆ రోజులు బాగున్నాయ్...!
మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా 
బర్త్ డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ చాక్లెట్లు పంచిన ఆ రోజులు బాగున్నాయ్....!
మటన్ బిర్యానీ,చికెన్ బిర్యానీ లేకున్నా 
ఎండాకాలం మామిడికాయ తొక్కు పెట్టిన రోజున అందరం కలిసి అన్నం తిన్న ఆ రోజులు బాగున్నాయ్....!
జేబు నిండా కార్డులున్నా,పర్సు నిండా డబ్బులున్నా.. 
కొట్టుకు పంపితే మిగిలిన చిల్లర కాజేసిన ఆ రోజులు బాగున్నాయ్....!
సెల్లు నిండా గేములున్నా..
బ్యాటు మార్చుకుంటూ క్రికెట్టాడిన ఆ రోజులు బాగున్నాయ్...!
బీరువా నిండా జీన్స్ ప్యాంట్లున్నా...
రెండు నిక్కర్లతో బడికెళ్ళిన ఆ రోజులు  బాగున్నాయ్....!
బేకరీల్లో కూల్ కేకులు తింటున్నా..
పావలా ఆశా చాక్లెట్ తిన్న ఆ రోజులు బాగున్నాయ్....!
చిన్న చిన్న మాటలకే దూరం పెంచుకుంటున్న ఈ రోజుల్లో..
పిల్లలం కొట్టుకున్నా సాయంత్రం కల్లా కలిసిపోయిన ఆ రోజులు బాగున్నాయ్...!
ఇప్పుడు ఇంటి నిండా తినుబండారాలున్నా..
నాన్న కొనకొచ్చే  చిరుతిళ్ళ కోసం ఎదురుచూసిన ఆ రోజులు బాగున్నాయ్....!
బట్టర్ స్కాచ్ చల్లగా నోట్లో నానుతున్నా..
అమ్మ చీర కొంగు పైసలతో గీతా ఐస్ కొని తిన్న ఆ రోజులు బాగున్నాయ్...!
దొంగల భయం,సెల్ ఫోన్ పోద్దనే భయం లేకుండా..
ఎండాకాలం లో ఆకాశంలో చందమామని చూస్తూ నిదురించిన ఆ రోజులు బాగున్నాయ్...!
ఆ రోజులు బాగుంటాయ్...
ఎందుకంటే అవి మళ్ళీ రావు కాబట్టి.....


మన కామారెడ్డి


Subscribe to this Mana Kamareddy Portal via Email :