Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Friday, March 04, 2016

Mana Kamareddy

డబుల్ బెడ్ రూమ్ పథకానికి దరఖాస్తు చేసుకునే విధానం..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకోవటానికి ప్రభుత్వం ఆన్ లైన్ విధానాన్ని తీసుకువచ్చింది. మధ్య దళారుల అవినీతి దృష్టిలో ఉంచుకొని, నిజమైన లబ్దిదారులకు ఈ పథకం యొక్క ఫలాలు చెందాలనే ఉద్దేశంతో, ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరుగకుండా, దగ్గరలో వున్న మీ సేవా కేంద్రాలలోనే దరఖాస్తు చేసుకొనే విధంగా ఏర్పాటు చేసింది.

దరఖాస్తు చేసుకునే విధానం:


-అర్హత ఉన్నవారు స్థానిక మీసేవా కేంద్రాల్లో సంప్రదించాలి.అక్కడ దరఖాస్తు ఫారాన్ని తీసుకుని, పూర్తి వివరాలతో నింపాలి.

-ఫారానికి పాస్‌పోర్టుసైజ్ ఫొటోతోపాటు, ఆధార్, ఫుడ్‌సెక్యూరిటీ కార్డు జిరాక్సులను జతపర్చాలి.

-కుటుంబ సభ్యుల ఆధార్‌కార్డు ఉంటే మంచింది.

-ప్రస్తుత అడ్రస్‌లో ప్లాట్‌నెంబర్ కాకుండా ఇంటి నెంబర్ ఉండేలా చూసుకోవాలి.మండలం, గ్రామం, కాలనీ, డివిజన్, ల్యాండ్‌మార్క్, లొకాలిటీ వంటి అంశాలను తప్పనిసరిగా పేర్కొనాలి.

-దరఖాస్తు దారుడి ఆధార్ నెంబర్, వయస్సు, సంవత్సర ఆదాయం, సెల్ నెంబర్లను కూడా తెలియపర్చాలి.

-గతంలో ప్రభుత్వ ఆసరా పెన్షన్, ఇళ్లు పొందినవారైతే స్పష్టంగా వివరాలను తెలపాలి.మొబైల్ నెంబర్, ఉంటే ఈ – మెయిల్ ఐడీలను పొందుపర్చాల్సి ఉంటుంది.

-ఇలా అన్ని వివరాలతో కూడిన ఫారాన్ని మీ సేవా కేంద్రాల్లో ఇస్తే, సదరు నిర్వాహకులు పరిశీలించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారం, ఫొటోలను అప్‌లోడ్ చేసి, మిగతా వివరాలను నింపుతారు.

-అనంతరం చెల్లిపు రశీదును అందించినప్పుడు రూ.25ను చెల్లించాల్సి ఉంటుంది. దళారుల చేతుల్లో మోసపోకుండా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.Subscribe to this Mana Kamareddy Portal via Email :