Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Saturday, June 11, 2016

Mana Kamareddy

మిషన్ కామారెడ్డి జిల్లా..కామారెడ్డి ప్రాంత చిరకాల కోరికైన కామారెడ్డి జిల్లాగా ఏర్పడటం దాదాపుగా ఖరారయ్యింది. ఇప్పుడు మన ముందు వున్న లక్ష్యం కామారెడ్డి పట్టణాన్ని, జిల్లాని విస్తృతంగా అభివృద్ధి చేసుకోవటం..రోడ్డు, రైలు రవాణా పరంగా ఏంతో అనువుగా వున్న కామారెడ్డి పట్టణాన్ని నిర్దిష్టమైన ప్రణాళికతో సరైన ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయావల్సిన అవసరం వుంది.


జిల్లా కేంద్రం కాబోతున్న కామారెడ్డి పట్టణంతో పాటు జిల్లాలో అభివృద్ధి ఎలా జరగాలంటే...

 • కామారెడ్డి పట్టణ వ్యాసార్థం కూడా పెరగాల్సిన అవసరం దృశ్య నూతన జిల్లాకి సంబంధించిన ప్రభుత్వ ఆఫీసులను ఇతర ప్రాంతాలనుండి వచ్చే ప్రజలకు అనువుగా ఉండేటట్టు ఏర్పాటు చేయాలి.
 • పట్టణంలో ట్రాఫిక్ రోజురోజుకు పెరుగుతున్న దృశ్య కావలసిన చోట రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపట్టవలసిన అవసరం వుంది.
 • పట్టణంలో కావలసిన చోట ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి.
 • కామారెడ్డి పట్టణంలో విస్తృతంగా చెట్లను నాటి గార్డెన్ టౌన్ గా మార్చి ఇతర జిల్లా కేంద్రాలకు స్ఫూర్తిగా నిలవాలి.
 • కామారెడ్డి బస్సు డిపోను జాతీయ రహదారికి దగ్గర్లో ఏర్పాటు చేసి దగ్గరలో నూతన ప్రయాణ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలి.
 • రోజు రోజుకు పెరుగుతున్న జనాభా కారణంగా, శాంతి భద్రతల దృశ్య పోలీస్ ఔట్ పోస్ట్ ల సంఖ్యను పెంచి, పట్టణంలో వివిధ చోట్ల సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి.
 • కామారెడ్డి పట్టణంలో ఇప్పటికే వున్న రాజీవ్ పార్క్ కి తోడుగా ఇంకో రెండు పార్క్ లను ఏర్పాటు చేయాలి.
 • నూతనంగా ఏర్పడబోయే కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు గుర్తించని పర్యాటక స్థలాలను గుర్తించి వాటిని తెలంగాణా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాలి.
 • నూతన కామారెడ్డి జిల్లాలోని వివిధ నియోజికవర్గ ప్రధాన పట్టణాలైన బాన్స్ వాడ, ఎల్లారెడ్డి లకు వెళ్ళే రహదారులను మరింత అభివృద్ధి చేస్తే జిల్లా ప్రజలకు అనువుగా మారనుంది.
 • కామారెడ్డి పట్టణానికి సమీపంలో భిక్కనూరు వద్ద వున్న తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో వృత్తి విద్యా కోర్స్ లను ప్రవేశ పెట్టేలా చర్యలు తీసుకోని క్యాంపస్ లో సౌకర్యాలు మెరుగుపరచాలి.
 • ఇప్పటికే విద్యా పరంగా ఎన్నో ప్రైవేట్ కళాశాలలకు నిలయంగా వున్న కామారెడ్డి పట్టణంలో ప్రఖ్యాత ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, డైరీ కాలేజీలలో సౌకర్యాలు మెరుగుపరిచి మరింత అభివృద్ధి చేయాలి.
 • కామారెడ్డి పట్టణంలో సమీపంలో ఉన్న పెద్ద చెరువును మరియు దగ్గరలో వున్న భిక్కనూరు మండలం జంగంపల్లి చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేస్తే జాతీయ రహదారికి దగ్గరగా, పర్యాటక పరంగా బాగుంటుంది.
 • తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ దగ్గరలో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలి. దీని వల్ల దోమకొండ, భిక్కనూరు మండలాలకు చెందిన విద్యార్థులకు అనువుగా ఉంటుంది.
 • కామారెడ్డి పట్టణంలో వున్న ఇందిరా స్టేడియంలో కావలసిన సౌకర్యాలను ఏర్పరచి వివిధ క్రీడలకు నెలవుగా మార్చవలసిన అవసరం వుంది. కామారెడ్డి డిగ్రీ కాలేజీ దగ్గరలో ఇండోర్ స్టేడియం ఏర్పాటుచేసే దిశగా చర్యలు తీసుకోవాలి.
 • కామారెడ్డి పట్టణంలో ప్రధానంగా వున్న త్రాగు నీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం వుంది.
 • కామారెడ్డి పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తే రాకెట్ వేగంతో అభివృద్ధి అయ్యే అవకాశాలు వున్నాయి.
 • రెవిన్యూ డివిజన్ కాబోతున్న బాన్స్ వాడ పట్టణంలో వున్న ఎస్ అర్ ఎన్ కె కాలేజీ ని విస్తరించి కొత్త కోర్స్ లు ప్రవేశ పెట్టెల చర్యలు తీసుకోవాలి.
 • నూతన జిల్లాలో ఒక పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలి
కొత్తగా ఏర్పడబోతున్న జిల్లా కేంద్రాల్లో మన కామారెడ్డి పట్టణానికి అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్న దృశ్య నూతన జిల్లాకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఇదే మంచి అవకాశంగా భావించి చిత్తశుద్ధితో పనిచేయవలసిన అవసరం వుంది.


Subscribe to this Mana Kamareddy Portal via Email :