Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Friday, September 02, 2016

Mana Kamareddy

రిలయన్స్ జియో నెట్ వర్క్ ప్లాన్ ల వివరాలు సంక్షిప్తంగా...


రిలయన్స్ ఇండస్ట్రీస్ వచ్చే సెప్టెంబర్ 5న ప్రారంభించబోతున్న తమ కొత్త మొబైల్ నెట్ వర్క్ జియో ఆఫర్లు, డాటా ప్లాన్ ల వివరాలను ఈరోజు కంపెనీ అధినేత ముకేష్ అంబాని విడుదల చేశారు. జియో ప్యాకేజీల్లో భాగంగా స్మాల్ (ఎస్) నుంచి ఎక్స్ ట్రా లార్జ్ (ట్రిపుల్ ఎక్స్ ఎల్) వరకూ ఏడు రకాల డేటా ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. వాటి వివరాలు ఇవి..(ఈ ప్యాకేజీలన్నీ నాలుగు వారాలకు... అంటే 28 రోజుల వ్యవధికి చెల్లుబాటవుతాయి)

ఎస్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 149. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 0.3 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లను పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి సిగ్నల్స్ ఈ ప్యాకేజీకి వర్తించవు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఎం (1) ప్యాకేజీ: టారిఫ్ రూ. 499. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 4 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 8 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఎం (2) ప్యాకేజీ: టారిఫ్ రూ. 999. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 10 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 20 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 1499. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 20 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 40 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఎక్స్ ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 2499. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 35 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 70 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఎక్స్ ఎక్స్ ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 3499. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 60 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 120 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ట్రిపుల్ ఎక్స్ ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 4499. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 75 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 150 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఈ ప్యాకేజీల్లో భాగంగా జియో ప్రీమియం యాప్స్ అయిన జియో ప్లే, జియో ఆన్ డిమాండ్, జియో బీట్స్, జియో మ్యాగ్స్, జియో ఎక్స్ ప్రెస్ న్యూస్, జియో డ్రైవ్, జియో సెక్యూరిటీ, జియో మనీ వంటివాటిని డిసెంబర్ 31 2017 వరకూ ఉచితంగా వాడుకోవచ్చు. డేటా ప్యాక్ ల విషయంలో మాత్రం ఈ సంవత్సరం డిసెంబర్ 31 తరువాత తమ టారిఫ్ ప్లాన్ ను కస్టమర్లు ఎంచుకోవాల్సి ఉంటుంది

ఈరోజు రిలయన్స్ అధినేత ముకేష్ అంబాని 45 నిమిషాల ప్రసంగం తర్వాత ఇప్పటికే మార్కెట్లో పేరుపొందిన ఎయిర్ టెల్, ఐడియా సంస్థల షేర్లు ఘననియంగా తగ్గాయి. ఈ రెండు సంస్థలకు కలిపి సుమారు 13800 కోట్ల మేర నష్టం వచ్చిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు.






Subscribe to this Mana Kamareddy Portal via Email :