తెలంగాణలొనే వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించే కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర బుధవారం రాత్రి కన్నుల పండుగగా ప్రారంభమైంది. పట్టణంలోని ధర్మశాల దగ్గర మొట్టమొదట యువజన సమాఖ్య వినాయకుడి వాహనం వద్ద ఆర్డీవో నగేష్ కొబ్బరి కాయ కొట్టి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదిక నుండి పట్టణ ప్రముఖులు శోభాయాత్రకు స్వాగతం పలికారు. శోభాయాత్రలో పెద్దలు, యువకులు మరియు చిన్నారులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. శోభయాత్రలో కొన్ని సంస్థల ఆధ్వర్యంలో వివిధ చౌరాస్తాలలో, గణేష్ మండలిల వద్ద పులిహోర, వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. శోభాయాత్రను చూసేందుకు పట్టణంతో పాటు డివిజన్ లోని వివిధ గ్రామాలనుండి ప్రజలు తరలివచ్చారు. అలా ప్రారంభమైన శోభాయాత్ర వివిధ విధుల గుండా వెళ్ళి టెక్రియల్ చెరువు వద్దకు చేరుకొని అక్కడ వినాయకులను నిమజ్జనం చేశారు.
కామారెడ్డిలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర దృశ్యాలు..
కామారెడ్డిలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర దృశ్యాలు..