Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Thursday, September 08, 2016

Mana Kamareddy

రిలయన్స్ జియోలో వున్న లొసుగులు..!!


దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ రిలయన్స్ జియో నెట్ వర్క్ సేవలు ఎట్టకేలకు పూర్తి స్థాయిలో వినాయకచవితి పర్వదినం నుంచి మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా మన కామారెడ్డి ఏరియాలో కూడా ఎక్కడ ప్రజలు మాట్లాడుకోవటం విన్న జియో సిమ్ గురించే వినబడుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 2 లక్షల స్టోర్లలో జియో తన సిమ్ కార్డులను విక్రయించింది. 10 కోట్ల మంది యూజర్ల లక్ష్యంగా ప్రారంభమైన జియో ఇప్పటికే చాలామందికి చేరువైంది.
సిమ్ కోసం స్టోర్ల ముందు కిలోమీటర్ల మేర క్యు దర్శనమిస్తున్నాయి కూడా. ఇక బ్లాకులో చెప్పనే అవసరం లేదు. అయితే ఇప్పుడు అందర్నీ కలవరపెడుతున్న అంశం ఏదంటే జియోతో వాయిస్ కాల్స్ ఉచితం..ఈ ఉచితంపై అందరికీ అనేక సందేహాలు వెలువెత్తుతున్నాయి. జియో సిమ్ తో వాయిస్ కాల్స్ ఎందుకు ఉచితం ? అందులో వున్న మతలబు ఏంటో ఇప్పుడు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం..

కేవలం డేటాకు లేదా కాల్స్ కు మాత్రమే స్మార్ట్ ఫోన్ వినియోగదారులు డబ్బు చెల్లిస్తే చాలు.
కాల్స్ కు డబ్బులు ఇచ్చే విధానం పోవాలి. మా నెట్ వర్క్ లో అన్ని కాల్స్ ఉచితం' అంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ జియో సేవలను గురించి వివరిస్తూ చేసిన ప్రకటన సంచలనానికే తెరతీశారు.

రిలయన్స్ జియో ఉచిత కాల్స్ పై విశ్లేషణ జరిపిన నిపుణులు కొన్ని వాస్తవాలను చెబుతున్నారు. అదేమీ ఉచితంగా లభించదని, దీని వెనుక రిలయన్స్ జియో పెద్ద ప్లాన్ ఉందని చెబుతున్నారు. అదేంటంటే...రిలయన్స్ జియో సిమ్ 4జీ ఎల్టీఈ విధానంలో పనిచేస్తుందన్న సంగతి తెలిసిందే. కేవలం 4జీ ఫోన్లు తప్ప, మార్కెట్లోని 2జీ, 3జీ ఫోన్లు పనిచేయవు. జియో కేవలం 4జీ తరంగాలపై మాత్రమే పనిచేస్తుంది.

మొబైల్ డేటాను ఆఫ్ చేస్తే కాల్స్ వెళ్లవు. మొబైల్ డేటా ఆన్ లో ఉంటేనే కాల్స్ చేసుకోగలుగుతాం. వీఓ ఎల్టీఈ సాంకేతికతను జియో వాడుతుండటమే ఇందుకు కారణం. ఈ కాల్స్ ను కూడా జియో తయారు చేసిన యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని దాన్నుంచి మాత్రమే చేసుకోవాలి.

ఇక కాల్స్ చేసుకుంటే మొబైల్ డేటా ఖర్చవుతుంది. ఒక నిమిషం కాల్ చేసుకుంటే సుమారు ఒకటిన్నర ఎంబీ వరకూ ఖర్చవుతుంది. దానికి చార్జ్ పడుతుందన్న విషయాన్ని రిలయన్స్ జియో చెప్పలేదు. దీనివల్ల ఉచితంగా కాల్స్ చేసుకుంటున్నామని కస్టమర్లు అనుకుంటారు. కానీ వారి ప్యాకేజీలో భాగంగా ఇచ్చిన డేటాలో ఎంతో కొంత ఈ కాల్స్ రూపంలో ఖర్చవుతుంది. ఇదే రిలయన్స్ జియో 'ఫ్రీ' వెనకున్న రహస్యం.

ముందు మూడు నెలలు లాంఛింగ్ ఆఫర్లో మాత్రమే ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఒక జీబీ డేటాను రూ.50లు పెట్టి కొనాల్సిందే. అలా కొన్న డేటా ఆన్ చేయకుండా కాల్స్ మాట్లాడుకుంటామంటే కుదరదు.

జియో నుంచి కాల్స్ చేయాలంటే కచ్చితంగా మొబైల్ డేటా ఆన్లో ఉండాల్సిందే. దీని ద్వారా వాయిస్ కాల్స్ చేసుకోవాలంటే ప్రత్యేకంగా రూపొందించిన యాప్ను వాడాలి. ఆ యాప్ పని చేయాలంటే డేటా ఆన్లో ఉండాల్సిందే. అంటే కాల్ మాట్లాడుతున్న ప్రతిసారీ డేటా ఖర్చవుతూనే ఉంటుంది.

డేటా అయిపోగానే మళ్లీ రీచార్జ్ చేసుకోవాలి. అంటే మిగిలిన ఫోన్లలో కాల్స్ చేసుకునరేందుకు రిచార్జి చేసుకుంటాం. జియోలో మాత్రం డేటా అయిపోగానే రీచార్జి చేసుకుంటాం. కాల్స్ కి పెట్టే డబ్బులు డేటాకు పెట్టాలన్నమాట.

ఇక పోతే డేటా వినియోగం కూడా 4జీలో ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 2జీలో 1జీబీ డేటా 10 రోజులు వస్తుందనుకుంటే.. అదే 4జీలో 1 జీబీ డేటా నాలుగు రోజల్లో అయిపోవచ్చు.

మనం ఫోన్ కాల్స్ మాట్లాడే దాన్నిబట్టి, నెట్ వాడేదాన్ని బట్టి అది ఇంకా వేగంగా కూడా అయిపోవచ్చే. అంటే ఇలా డేటా అయిపోయిన ప్రతిసారీ మళ్లీ రీచార్జ్ చేసుకోవాల్సిందే. అలా రీచార్జ్ చేసుకోకుంటే తప్ప కాల్స్ చేయలేం.

రిలయన్స్ జియోలో వాయిస్ కాల్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన VoLTE టెక్నాలజీని వాడుతున్నారు. ఈ టెక్నాలజీ లేని యూజర్లు వాయిస్ కాల్స్ చేసుకోవాలంటే జియో ప్రత్యేకంగా రూపొందించిన యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా వాయిస్ కాల్ చేసుకోవాలన్నా మైబైల్ ఇంటర్నెట్ ఆన్ చేసి ఉండాల్సిందే

అయితే కంపెనీ వ్యూహం ఎలా ఉందంటే.. ఒకసారి జియోకు ప్రజలు అలవాటు పడేలా చేసి, ఆపై అధిక చార్జీలు వసూలు చేసే ఆలోచనలోనే రిలయన్స్ ఉండి ఉండవచ్చని టెలికం రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పై అంశాలకు తోడు రిలయన్స్ జియో సిమ్ తీసుకొనేటప్పుడు మీ మొబైల్ ఐయంఈఐ నంబరు ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే మీ మొబైలు ఐయంఈఐ నంబరుతో జియోసిమ్ ట్యాగ్ చేయయబడుతుంది.భవిష్యత్తులో ఇంకో సిమ్ ఆ స్లాటులో వేసినా పనిచేయదు. అది అలా వుంచి కనీసం ఈ మూడు నెలలు ఉచితంగా వాడేసికొని తర్వాత వదిలేద్దాం అనుకుంటున్నారేమో.అలా చేసినట్లయుతే జనవరి 1 నుండి మీ నుండి రెంటల్ ఛార్జీలు వసూలు చేస్తారు. మీ దగ్గర ఏదైనా 4జి సపోర్ట్ చేసే మొబైల్ ఉంటే కనుక మీరు జాగ్రత్తగా నియమ నిబంధనలను చదివి మరి జియో సిమ్ తీసుకోని ప్రయత్నం చేయండి.


Subscribe to this Mana Kamareddy Portal via Email :