
ఫేర్వెల్ టైం వచ్చేసింది..కొన్ని దశాబ్దాలుగా నిజామాబాదిలం అని చెప్పుకునే మనం త్వరలో కామారెడ్డి వాళ్ళం అని చెప్పుకునే రోజు వచ్చేసింది. సుమారు డెబ్భై ఐదు సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాగా మమేకమైన కామారెడ్డి ప్రాంత ప్రజలకు నిజామాబాద్ నగరంతో కాని, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాగా ప్రజలకు ఉన్న అనుబంధం మాత్రం విడదీయరానిది. ఓక వైపు నూతనంగా కామారెడ్డి జిల్లా ఏర్పడుతున్న శుభ తరుణం మరో వైపు నిజామాబాద్ జిల్లాకు దూరమౌ తున్నామన్న తెలియని బాధ మరోవైపు...ఏది ఏమైనా మనం ఇందూరు జిల్లాలో భద్రపరుచుకున్న ఆనవాళ్ళను నెమరు వేసుకుంటూ ఆ అనుబంధాల జ్ఞాపకాలను మనతో మోసుకెల్తూ కామారెడ్డి జిల్లాగా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నా..భవిష్యత్తులో మన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు సోదర భావంతో అన్నదమ్ముల లాగ తెలంగాణ రాష్ట్రంలో పోటాపోటీగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ....
బై బై నిజామాబాద్ జిల్లా...వి అర్ రియల్లీ మిస్ యు..