Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Monday, November 14, 2016

Mana Kamareddy

గోవా సభలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన ప్రధాని మోడీ..నిన్న గోవాలో నిర్వ‌హించిన స‌భ‌లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతుండగా భావోద్వేగానికి గురయ్యారు. నల్లదనంపై తాను తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయం గురించి మాట్లాడుతున్న సమయంలో కంటి నుంచి వస్తున్న నీటిని తుడుచుకోవడం.. అందరి హృదయాలనూ బరువెక్కించింది. త‌న‌కు ప్ర‌జ‌లు అవినీతిని అంతం చేసేందుకే అధికారం అప్ప‌జెప్పార‌ని, మ‌రి దాన్ని అంతం చేయ‌కుండా ఎలా ఉండగలనని ప్రశ్నించారు. ప్ర‌స్తుతం సామాన్యులు ఎదుర్కుంటున్న ఇబ్బందులు చూస్తుంటే త‌న‌కు కూడా బాధ కలుగుతుందని.. తాను ఏదైనా తప్పు చేసివుంటే ఏ శిక్షకైనా సిద్ధమ‌ని వెల్లడించారు...


పెద్ద నోట్లు ర‌ద్దు నిర్ణయంతో 50 రోజులు కొన్ని ఇబ్బందులు ఉంటాయ‌ని చెప్పారు. బినామీ ఆస్తులపై చర్యలు తీసుకుంటామ‌ని వెల్లడించారు. 2జీ స్కామ్‌ నిందితులు కూడా ఇప్పుడు పాత నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల వ‌ద్ద‌కు వెళ్లి క్యూలో నిల‌బ‌డుతున్నార‌ని.. న‌ల్ల‌ధ‌నాన్ని అంతం చేసే వ‌ర‌కు తాను విశ్ర‌మించ‌న‌ని చెప్పారు. ఆభరణాల కొనుగోలుకు పాన్ కార్డును తప్పనిసరి చేయవద్దని ఎంతో మంది ఎంపీలు తనను కోరారని.. అయినా తాను వినలేదని చెప్పారు. దాదాపు 10 నెలల నుంచే పెద్ద నోట్ల రద్దు ఆలోచన చేసినట్టు చెప్పారు...

ఇంకా మోడీ మాట్లాడుతూ..
నేనేమీ అత్యున్నత పదవిని అనుభవించేందుకు పుట్టలేదు. పుట్టుకతోనే నా వద్ద డబ్బు.. అధికారం లేదు. దేశ ప్రజల కోసం కుటుంబాన్ని, ఇంటిని కూడా త్యాగం చేశాను. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం దేశ వ్యవస్థలో ఎలాంటి మార్పును తెస్తుందో నాకు తెలుసు. కొంతకాలం ఆగితే.. దాని ప్రభావం ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. నాపై నమ్మకంతో కోట్ల మంది అండగా నిలిచారు. ఏమిచ్చి ప్రజల రుణం తీర్చుకోగలను' అంటూ భావోద్వేగానికి గురయ్యారు...
Read this also: ప్రభుత్వానికి టాక్స్ అసలే కట్టమంటూ ఓక ఓటరు ప్రధానికి రాసిన లేఖ... 


Subscribe to this Mana Kamareddy Portal via Email :