
కామారెడ్డి పట్టణంలో ఆక్రమణలపై బల్దియా అధికారులు ఎట్టకేలకు కొరడా ఝళిపించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లను ఆక్రమిస్తూ నిర్మించిన నిర్మాణాలపై చర్యలకు ఉపక్రమించారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో మురికి కాలువలు ఆక్రమిస్తూ నిర్మించిన కట్టడాలను బల్దియా అధికారులు గుర్తించి వాటిని జేసిబి సహాయంతో తొలగించారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో వున్న అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. పట్టణంలో వివిధ కాలనీ లలో వున్న ఆక్రమణలు స్వచ్చంధంగా తొలగించుకోవాలని లేనిపక్షంలో కూల్చివేతలు తప్పవని హెచ్చరించారు.